![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -529 లో.. శ్రీధర్, కాంచనతో మాట్లాడతాడు. అప్పుడే కావేరి ఎంట్రీ ఇస్తుంది. నేను ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ లేరని కావేరి అంటుంది. నేను ఇప్పుడు దీప కోసం వచ్చాను. తనకి ఈ స్వీట్స్ తీసుకొని వచ్చానని చెప్తుంది. అప్పుడే శౌర్య వచ్చి కావేరికి హాయ్ చెప్తుంది. నాకు మాత్రమే చెప్తున్నావ్.. మీ తాతయ్యకి చెప్పవా అని కావేరి అనగానే తాతయ్య ఎప్పుడు వస్తాడుగా అని శౌర్య అంటుంది. అంటే ఆయన ఇప్పుడు సీఈఓ కదా కార్తీక్ గురించి వస్తుంటారని కాంచన కవర్ చేసినట్లు మాట్లాడుతుంది. నాకు ఒక లడ్డు ఇవ్వు అని శౌర్య అనగానే ఇది మీ అమ్మకి అని కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్, దీప ఎంట్రీ ఇస్తారు.
వచ్చావారా మీ నాన్న నీతో మాట్లాడాలని చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారని కాంచన అంటుంది. నీకు దీప ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేదా అని కాంచనపై శ్రీధర్ కోప్పడతాడు. ఎందుకు అంటే అలా ఉన్న కోడలిని మీ ఇంటికి పనికి పంపుతావా.. ఈ రోజు ఆ ఇంట్లో దీప పడిపోయేది.. సుమిత్ర పట్టుకుంది. కార్తీక్ తండ్రి కాబోతున్నాడంటే నేను తాతయ్య కాబోతున్నానని హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వేం చేస్తావో తెలియదు. దీప ఆ ఇంటికి వెళ్లకుండా చూడమని శ్రీధర్ చెప్పి వెళ్తాడు. కావేరి నువ్వు కూడా వెళ్ళమని కాంచన అనగానే శ్రీధర్ తో పాటు కావేరి కూడా వెళ్తుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఇంటికి దీప వెళ్ళడానికి వీల్లేదని కాంచన తెగేసి చెప్తుంది. మరొకవైపు శ్రీధర్ కి పీఏగా కాశీకి జాబ్ ఇస్తాడు. నాకు వద్దని కాశీ అంటాడు.
నువ్వు ఈ జాబ్ చెయ్యకపోతే మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతానని స్వప్న బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో కాశీ జాబ్ కి ఒప్పుకుంటాడు. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు నేను చెప్పిందేం చేసారని కార్తీక్, దీపలని కాంచన అడుగుతుంది. అప్పుడే శౌర్య వస్తుంది. పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే ఎందుకు మధ్యలో వస్తావని శౌర్యపై కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత దీపపై కార్తీక్ కోప్పడతాడు. ఎందుకు దానిపై అరుస్తున్నావని కార్తీక్ పై కాంచన అరుస్తుంది. నాకు కోపం వస్తే నేనేం చెయ్యాలి.. అద్దంలో చూసుకుంటా.. నాకు నేను అరవాలని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |